డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధి సిద్ధిపేట ప్రాంతీయ సమన్వయ అధ్యయన కేంద్రంలో ఈ నెల 26 నుండి వచ్చే నెల 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ. డిగ్రీ నాన్ సెమిస్టర్ బ్యాచ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు తమ హాల్టికెట్లను వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని, సకాలంలో హాజరు కావాలని సూచించారు.