విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని రావిపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ కాలనీ పూరి గుడిసెలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ఇంట్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయని తెలిపారు. హుటాహుటిన మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు.