అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకాల ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం.. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు అని వైసీపీ నాయకులూ బస్సు యాత్ర సందర్భంగా తెలియజేసారు. ఇంకా ... అధికారం చేపట్టాక తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు వారికే కేటాయించారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో మంత్రి పదవులు ఆయా వర్గాలకు ఇవ్వడం ఇదే తొలిసారి. హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజును ఛైర్మన్‌గా, మైనార్టీ మహిళ జకియా ఖానంకు డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా అవకాశం కల్పించారు. గత మూడేళ్లలో రాష్ట్రం నుంచి ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా నాలుగు సీట్లను బీసీలకే ఇచ్చి సామాజిక న్యాయంపై చిత్తశుద్ధిని చాటుకున్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది సభ్యులుండగా 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కావడం అలంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు.