ఓ యువతి ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పొన్నూరు పట్ట ఇంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం.. యువతి ఇంట్లో పని చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఎలుకల మందు తిని ఆత్మహత్య యత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువతి మృతిచెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్బన్ పోలీసులు తెలిపారు.