అనుమతి లేని కంపెనీల విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ ఆంజనేయులు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం స్థానిక న్యూ ముబారక్ విత్తన షాపును తనిఖీ చేసి రికార్డులు, స్టాక్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే షాపును సీజ్ చేస్తామన్నారు. కొనుగోలుదారులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలు నమోదు చేయాలని సూచించారు.