ఇవాళ ఉదయం శ్రీకాకుళం నుంచి మొదలైన బస్సు యాత్రలో మహిళా మంత్రులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారని మహిళా మంత్రులు పేర్కొన్నారు. వైయస్ జగన్ గారికి ఉన్న విశాల దృక్ఫథం వల్లే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం బదిలీ జరిగిందన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సామాజిక భేరి బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ గారి కేబినెట్ లోని మొత్తం 25 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారని చెప్పారు.