ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కు షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 03:23 PM

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జగన్‌తో పాటు ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులపై గురువారం కోర్టులో కేసు పెట్టారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తే వరుసగా పోలీస్ కేసులు పెట్టి రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని చింతమనేని ఆరోపించారు. ఏలూరు కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ఇతరులపై ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తనను టార్గెట్ చేసి, పోలీసు కేసులు పెట్టిస్తున్నారని ఆయన వాపోయారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com