అనంతపురం జిల్లా పోలీసు ఆసుపత్రిలో డెప్యుటేషన్ పై పని చేస్తూ ఇటీవల మృతి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ బాబురావు కుటుంబానికి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి సూచనల మేరకు అదనపు ఎస్పీ నాగేంద్రుడు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. కరోన సమయంలో జిల్లా పోలీసు, సెబ్ మరియు విజిలెన్స్ విభాగాల అధికారులు, సిబ్బందికి విశిష్ట సేవలు అందించిన బాబురావు చనిపోవడంతో ఆయన కుటుంబానికి ఆర్థికంగా సాయం అందించాలనే సంకల్పించి ఈ మూడు విభాగాల అధికారులు, సిబ్బంది సాయం అందించారు.