రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ రాజ్యం అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పాలితులుగా ఉన్నవారు పాలకులుగా మారారో వారికి వీటిని వివరించాల్సిన ఆవశ్యకత ఉంది..అందుకే బస్సు యాత్ర చేపడుతున్నామని అన్నారు. ఈ మార్పును ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు బస్సు యాత్ర చేపడుతున్నామని తెలిపారు. వృత్తి కులాలకు చెందిన వారికి ఆదరువుగా నిలిచిన ప్రభుత్వం ఇది. ఇదంతా మార్పు.. నిధులలో దుర్వినియోగం లేదు. అందుకే విపక్ష నాయకులు అవినీతి ఆరోపణలు చేయలేకపోతున్నారు. వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన సామాజిక న్యాయ భేరి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు.