ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్కోచ్‌ను 'స్టార్ ఆఫ్ గవర్నెన్స్' అవార్డుకు ఎంపికైంది. జూన్ 18న ఢిల్లీలో జరిగే ఇండియన్ గవర్నెన్స్ ఫోరమ్‌లో ఈ అవార్డును అందజేయనున్నారు. గ్రామీణాభివృద్ధికి స్కోచ్ అవార్డు రావడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ పాలనలో అనుసరిస్తున్న విప్లవాత్మక విధానాలు, సంస్కరణల వల్ల రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. పారదర్శకత, ప్రజలకు ప్రభుత్వ సేవలు... ఇలా ఎన్నో పథకాలతో సీఎం జగన్ పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.