గురువారం చెన్నై సభలో ప్రధాని ముందు తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో మాట్లాడే భాష తమిళం మాత్రమేనని స్పష్టం చేశారు. ద్రవిడ పాలన మోడల్ దేశాన్ని చూపుతుందని అన్నారు. 'హిందీ జాతీయ భాష'పై ఇటీవల వివాదం చెలరేగిన నేపథ్యంలో సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చిచెప్పారు. కేంద్రం, రాష్ట్రాలతో కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తమిళనాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులను వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ వేదికపై మోదీని కోరారు.