ఏపీలోని నంద్యాల జిల్లా మిట్నాల గ్రామానికి చెందిన శిరీష 3 పెళ్లిళ్లు చేసుకుంది. ఎవరికీ విడాకులు ఇవ్వలేదు. మూడో భర్త మహేశ్వరరెడ్డికి ఇది రెండో పెళ్లి కావడంతో శిరీష తనకు రక్షణగా రూ.5 లక్షలు డిపాజిట్ చేయించుకుంది. అయితే శిరీష తల్లి మరిన్ని డబ్బులు డిమాండు చేసింది. మహేశ్వరరెడ్డి అనుమానంతో శిరీష గురించి విచారించగా ఆమెకు ఇప్పటికే 2 పెళ్లిళ్లు జరిగినట్లు తెలిసింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.