లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. నారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు భక్తజనుల సంచారంతో ప్రధానాలయం, తిరుమాడ వీధులు, ప్రసాదాల విక్రయశాల, దర్శన క్యూ కాంప్లెక్స్‌లో గురువారం భక్తుల సందడి నెలకొంది. కొండ కింద గండిచెరువు సమీపంలోని కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రారంభం కావడంతో. భక్తులు తలనీలాలు సమర్పించుకుని లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం యాదగిరీశుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ప్రసాదాల విక్రయశాల కౌంటర్లను కూడా సంప్రదాయ పూజల అనంతరం అధికారులు ప్రారంభించారు. యాదగిరి కొండకు విచ్చేసిన భక్తులు ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. నిత్య ఆదాయం రూ. 19, 26, 044 లక్షలు సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.