అనంతపురం జిల్లా పరిధిలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆధ్వర్యంలో ఇదివరకే సీజ్ చేసిన రూ. 18 లక్షల విలువ చేసే ఇతర రాష్టాల మద్యంను ధ్వంసం డి.హీరేహాళ్ పోలీసులు & సెబ్ విభాగం అధికారులు ధ్వంసం చేసారు. 290 NDPL కేసుల్లో సీజ్ చేసిన 4,860 లీటర్ల సామర్థ్యం కల కర్నాటక టెట్రా పాకెట్లు, మద్యం బాటిళ్లను డి.హీరేహాళ్ సమీపంలోని ఓ ప్రయివేట్ వెంచర్ లో జె.సి.బి ద్వారా నేల మట్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిల్లాలో ఇలాంటి ఘటనలు, అక్రమ రవాణా కేసులు పెరగకుండా తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడిన తగిన శిక్ష పడుతుంది అని అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేశారు.