విశ్వవిఖ్యాత, నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు పురస్కరించుకొని, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ ఇంచార్జి అరవింద్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయం. ఆ మహానేతను స్మరించుకుంటూ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిభిరంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు రక్తదానం చేసినట్లు ఆయన, గ్రామ నాయకులతో కలిసి మీడియా ముఖంగా తెలిపారు.