వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలను వివరిస్తూ 17 మంది మంత్రులతో కూడిన బృందం ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను గురువారం శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలి నుంచి ప్రారంభించింది. దారి పొడవునా ప్రజల దీవెనలతో పలు ప్రాంతాల మీదుగా మండుటెండలోనూ తొలిరోజు యాత్ర ఉత్సాహభరితంగా సాగింది. అయితే వర్షం కారణంగా సాయంత్రం విజయనగరంలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దైంది. అప్పటికే సభా ప్రాంగణానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సభ నిర్వహణకు సరిగ్గా అరగంట ముందు వర్షం కురవడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా రద్దు చేయాలని నిర్ణయించారు.