ఏదైనా వంటకాల్లో ఉప్పు లేకుంటే అది రుచిగా అనిపించదు. ఏ మాత్రం కాస్త ఉప్పు ఎక్కువైనా తినలేని పరిస్థితి. అలాంటి సందర్భాల్లో కొన్ని టిప్స్ పాటిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కాస్త నిమ్మకాయ పిండితే బ్యాలెన్స్ సరిపోతుంది. పులుసు కూరల్లో ఉప్పు ఎక్కువైతే బంగాళా దుంపను కట్ చేసి వేయాలి. పిండిలో ఉప్పు ఎక్కువైతే కొంచెం మోతాదులో పాలు కలపాలి. పుల్లని పెరుగు, పీనట్ బటర్ వేసినా ఉప్పు పాళ్లు తగ్గుతాయి. తద్వారా ఎంతో కష్టపడి చేసిన వంట చక్కని రుచి సంతరించుకుంటుంది.