రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం పాత గాజువాకలోని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. సామాజిక న్యాయ భేరి యాత్రలో పాల్గొన్న మంత్రులకు ఉత్తరాంధ్ర ప్రజలు ఘన స్వాగతం పలికారు. సభ ప్రాంగణం ముఖ్యమంత్రి వైయస్ జగన్ నినాదాలతో దద్దరిల్లింది. ఈ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు గాజువాకలో ఏర్పాటు చేసిన సభా వేదికపై హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘‘ఆంధ‍్రప్రదేశ్ ముఖ‍్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా కూడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. జగనన్న తప్ప గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు లేరని అన్నారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోంది. మళ్లీ సీఎం వైయస్ జగన్‌ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. దళితులను అవమానించిన వ్యక్తి చంద‍్రబాబు. మహానాడు కాదు.. అది వల్లకాడు. మేనిఫెస్టోను తుంగలో తొక్కిన వ్యక్తి, చరిత్ర హీనుడు చంద్రబాబు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు.