కందుకూరులోని ప్రసిద్ది చెందిన గ్రామదేవత అంకమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి చొరవతో రూ 7 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం జరుగుతోంది. పూర్తిగా రాతి కట్టుబడితో నిర్మాణం జరిపించడం కోసం గుంటూరు జిల్లా కోటప్పకొండలోని శిల్పశాలలో పనులు వేగంగా సాగుతున్నాయి. అందులో నిర్మాణానికి సిద్ధమైన భారీ శిలలు లారీలలో శుక్రవారం కందుకూరు చేరుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa