హిమ పర్వతాలు, అత్యంత సంక్లిష్ట వాతావరణంతో నిండివుండే లద్ధాక్ లో నిన్న ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సైనికులు మృతి చెందిన దుస్సంఘటన నా మనసును తీవ్రంగా కలచివేసింది అని జనసేన నాయకులూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.... మరో 19 మంది సైనికులు తీవ్రంగా గాయపడడం మన దురదృష్టంగా భావిస్తున్నాను. మానవ ప్రాణాలు ఎంతో విలువయినవి. అందులోను సైనికుల ప్రాణాలు మరెంతో అపురూపమైనవి.దేశం కోసం తమ సర్వసౌఖ్యాలు విడనాడి, అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల త్యాగాలకు ఏమి తిరిగిచ్చి రుణం తీర్చుకోగలం?. అటువంటి జవాన్లు దేశ రక్షణ కర్తవ్యంలో భాగంగా తమ శిబిరం నుంచి వాహనంలో ప్రయాణిస్తూ మార్గమధ్యలో వాహనం నదిలోకి జారిపడి ప్రాణాలు కోల్పోవడం మాటలకు అందని విషాదం. అమరులైన వీరులకు గౌరవ వందనం అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.అమరుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు,వారి స్వరాష్ట్ర ప్రభుత్వాలు కూడా లెక్కలు వేయకుండా ఉదారంగా ఆర్ధిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.అమరుల కుటుంబాలకు ఏ లోటు రాకుండా చూసుకోవలసిన భాద్యత ప్రభుత్వాలతోపాటు భారతీయులందరిపై ఉందని మనవి చేస్తున్నాను అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa