ప్రపంచ దేశాల్లో మంకీపాక్స్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 20 పైగా దేశాల్లో దాదాపు 200లకు పైగా కేసులను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO వెల్లడించింది. మంకీపాక్స్ కి సంబంధించి ఎన్నో ప్రశ్నలు సమాధానం లేకుండా ఉన్నాయన్న ఆరోగ్య సంస్థ..అసాధారణ లైంగిక చర్యలూ కూడా వైరస్ వ్యాప్తికి కారణమై ఉండొచ్చని అంచనా వేసింది. ఇప్పటివరకు మంకీపాక్స్ సోకినవారిలో........ అత్యధికులు స్వలింగ సంపర్కులు, బయో సెక్సువల్స్ ......, గేలు ఉన్నట్లు బ్రిటన్ , అమెరికా సహా పలు దేశాల వైద్యులు సైతం ప్రకటించారు.