ఆస్ట్రేలియాకు చెందిన ఐలా సమ్మర్ ముచా అనే చిన్నారి 2021 డిసెంబర్‌లో జన్మించింది. పుట్టుకతోనే బైలేటరల్ మైక్రోస్టోమియా అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి కారణంగా ఆమె పెదాలు సాగినట్లు ఉంటాయి. నోరు దగ్గర పెద్దగా ఉండటంలో ఆ చిన్నారి పాలు తాగలేకపోతోంది. ఆమె పెదాలను సరిచేసేందుకు డాక్టర్లు శస్త్రచికిత్స చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఈ తరహా కేసులు 14 మాత్రమే ఉన్నాయట.