కృష్ణా నదిలో వాటర్ డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామ సమీపంలో కృష్ణా నదిలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి.నదిలోకి మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ఈ రాతి విగ్రహాలను గుర్తించారు. సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలను గుర్తించి పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొంతమంది భక్తులు ఆ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. నదీ ప్రవాహంలో విగ్రహాలు కొట్టుకువచ్చాయా..? లేక కృష్ణా నదిలో ఏమన్నా దేవాలయం ఉండేదా అన్నవిషయం పురావస్తు శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది.