రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ తరుణంలో అమాయక రైతులే టార్గెట్గా కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్) పథకంలో భాగంగా సోలార్ పంపు సెట్లకు సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. అయితే ఇలాంటి నకిలీ వెబ్సైట్ను కేటుగాళ్లు సృష్టించారు. అంతేకాకుండా రైతులకు నకిలీ లింకులు పంపి డబ్బులు కాజేస్తున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం సూచనలు చేసింది.