భర్త వేధింపులపై భార్య ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఏర్పేడు సిఐ శ్రీహరి తెలిపారు. వివరాల మేరకు మండలంలోని మరీమందాకు చెందిన మురగయ్యా, సరళకు 27 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. ఐదేళ్ల క్రితం నుంచి గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న మురుగయ్య, ధనలక్ష్మి, గోవర్ధన రెడ్డి కలసి సరళపై దాడి చేసి గాయపరిచారు. సరళ ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.