ప్రత్తిపాడు మండలం పోతులూరు, ఒమ్మంగి, ధర్మవరం పరిసర ప్రాంతాల్లో క్రూరమృగం సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఇది అత్యంత ప్రమాదకరమైనదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆ అడవిమృగం దాడి చేసి, ఆరు పశువులను హతమార్చింది. దాడి చేసిన మృగం కాలి ముద్రలను బట్టి పులిగా అనుమానిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కావున పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.