ఉమ్మడి విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన రామలక్ష్మి అనే మహిళ తన భర్త సత్తిబాబును తన మేనత్త, ప్రియుడితో కలిసి హత్య చేయించింది. రామలక్ష్మికి అదే గ్రామానికి చెందిన ఎర్రినాయుడుతో ఎఫైర్ ఏర్పడింది. ఈ విషయం సత్తిబాబుకు తెలియడంతో భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె తన భర్తను చంపించింది. గతేడాది ఆగస్టు 7న ఈ హత్య జరిగింది. 9 నెలల తరువాత పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.