మహారాష్ట్రలోని పూణెలో ఓ 35 ఏళ్ల మహిళ తన ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఓ బాబా వద్దకు వెళ్లింది. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పూజలు చేయాలని ఆ బాబా ఆమెకు చెప్పాడు. గదిలోకి తీసుకెళ్లి బట్టలు విప్పమన్నాడు. ఆమె నిరాకరించడంతో ఆమె భర్త, సోదరుడు మరణిస్తారని, కొడుకు అంగవైకల్యంతో పుడతాడని భయపెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు ధనంజయ్ గోహద్(63)ను అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa