తన కుమారుడి హత్య తర్వాత సింగర్ సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు లేఖ రాశారు. ‘మీ ప్రభుత్వ వైఫల్యాల వల్లే నా కొడుకు మమ్మల్ని విడిచిపెట్టాడు’ అని రాశారు. "శుబ్దీప్ తల్లి తన కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడని నన్ను అడుగుతుంది, నేను ఆమెకు ఏమి సమాధానం చెప్పాలి? నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అని అతను లేఖలో పేర్కొన్నాడు.