పెళ్లికి ముందు 20 ఏళ్ల యువతి ఫొటోను చూపించారు. పెళ్లిలో 35 ఏళ్ల మహిళకు మేకప్ వేసి పెళ్లి జరిపించేశారు. పెళ్లైన తెల్లారి తన ఇంట్లో ఉన్న మహిళను ఎవరు అంటూ ప్రశ్నించాడు. మీ భార్యనంటూ ఆమె బదులిచ్చింది. దీంతో రాజస్థాన్‌లోని జాలోర్‌కు చెందిన సోహాన్ సింగ్ అనే యువకుడు తాను మోసపోయానని గగ్గోలు పెడుతున్నాడు. రూ.5 లక్షలు తీసుకుని పెళ్లి జరిపించిన మధ్యవర్తి గణ్‌పత్ దంతియాపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.