హోళగుంద బస్టాండులో వాహనాల రుసుం వసూలుకు సంబంధించి మంగళవారం వేలంపాట నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రంగమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం మాట్లాడుతూ. గ్రామ సర్పంచ్ మాల రంగమ్మ ఆధ్వర్యంలో జరిగే ఈ వేలంపాటలో ఆసక్తి కలిగి సాల్వెన్సు (సొంత ఆస్తులు) ఉన్న వారు రూ. 50వేలు, సాల్వెన్సు లేని వారు రూ. 70 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గోనాలన్నారు. హెచ్చు పాటాదారులకు వేలాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.