సిద్దేశ్వర అలుగు నిర్మాణం సాధన కోసం రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న జలదీక్ష కార్యక్రమానికి సంబంధించి సోమవారం జిల్లా ఎస్పి రఘువీర్ రెడ్డి సంగమేశ్వరంలోని జలదీక్ష ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల దీక్ష కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు కార్యక్రమం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే పలు సూచనలతో కూడిన దిశానిర్దేశం చేశారు. ఈయన వెంట ఆత్మకూరు డీఎస్పీ శృతి, ఆత్మకూరు నందికొట్కూరు సిఐలు సుబ్రహ్మణ్యం, సుధాకర్ రెడ్డి కొత్తపల్లి ఎస్ఐ ముబీన్ తాజ్ ఉన్నారు