శెట్టూర్ మండల పరిధిలోని యర్రబోరేపల్లి గ్రామంలో ఇండియన్ గ్యాస్ లీకేజీ వల్ల మంటలు చెలరేగాయి స్థానికులు వెంటనే బయటకు సిలిండర్ ను ఈడ్చుకు రావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో గ్రామ ప్రజలు అందరు ప్రమాదం నుంచి బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. గత మూడు రోజుల క్రితం ములకలేడు గ్రామంలో సిలిండర్ పేలి నలుగురు మృతిచెందడంతో అది మరవక ముందే మరొకసారి సిలిండర్ లీకేజ్ వల్ల మంటలు అంటుకోవడంతో గ్రామస్తులంతా భయాందోళనలకు గురయ్యారు. కావున గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే గోడౌన్ల వద్ద సిలిండర్ లీకేజీ చెక్ చేసి ఇస్తే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసు కోవని గ్రామస్తులు తెలిపారు.