యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూర్చిన ఆదాయం ఆలయ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాలతో, ప్రసాద వితరణ తో, సత్యనారాయణ స్వామి వ్రతాలతో, సువర్ణ పుష్పార్చన తో, వాహనపూజతో, నిత్య కళ్యాణం, అన్నదాన విరాళం, కారు పార్కింగ్, కళ్యాణ కట్ట, యాద ఋషి నిలయం తో తదితర విభాగాలతో మొత్తం కలిపి రూ. 25,25,411 ఆదాయం సమకూరిందని తెలిపారు.