మహారాష్ట్రలోని మహాడ్ లో దారుణం జరిగింది. ఓ మహిళ తన ఆరుగురు పిల్లల్ని బావిలోకి తోసేసి చంపింది. ధలకతి గ్రామంలో నివసించే దంపతులకు ఆరుగురు సంతానం. భర్త మద్యానికి బానిసై భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. మహిళ ఆగ్రహంతో తన ఆరుగురు పిల్లల్ని బావిలోకి పడేసి అనంతరం ఆమె దూకింది. ఇది గమనించిన స్థానికుడు బావిలోకి దూకి ఆమెను రక్షించాడు. ఆరుగురు పిల్లలు చనిపోయారు.