తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డా.ఎం ప్రదీప్, ఎన్.రమేశ్ కు కేరళలో రూ.10 కోట్ల లాటరీ తగిలింది. ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ ను ఓ ఏజెంట్ వద్ద కొన్నారు. అదృష్టవశాత్తు వారు కొన్న టికెట్ కే రూ.10కోట్ల లాటరీ తగిలింది. మే 15న ఈ లాటరీ డ్రా తీశారు. ప్రదీప్, రమేశ్ సోమవారం లాటరీ భవన్ కు వెళ్లి లాటరీ టికెట్ చూపించి రూ.10 కోట్లు తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa