కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హోసనగర ప్రభుత్వ పాఠశాలలో టీచర్ రేఖా కునాల్. ఆమె స్కూల్ లో చదివే ప్రతి విద్యార్థికి 1000 రూపాయలు స్థానిక కెనరా బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ విద్యార్థి 10 సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా డ్రా చేసుకోవచ్చు. దీంతో స్కూల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. దాతల సాయంతో ఇతర వసతులు సమకూరుస్తున్నారు. చదువు విలువ తెలిసి ఇలా చేస్తున్నానన్నారు పంతులమ్మ. ఆమెను అంతా అభినందిస్తున్నారు.