గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే వేడి వేడి నీటిని తాగితే చాలా మంచిది. ఇటువంటి సమస్యకు చికెన్ సూప్ బాగా పనిచేస్తుంది. మిరియాలను మరిగించిన పాలను తాగితే గొంతు గరగరకు ఉపశమనం లభిస్తుంది. నిమ్మరసం, తేనెను కలుపుకుని తాగితే ఎంతో మంచిది. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకుని టీ చేసుకుని తాగితే గొంతు గరగర అనేదే ఉండదు. అల్లం రసాన్ని వడగట్టి వేడిగా తాగినా ఉపశమనం లభిస్తుంది.