తిరుపతిలో వేణుగోపాల్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్య పద్మను కొట్టి చంపి చెరువులో పడేశాడు. 2019లో వీరికి వివాహం జరిగింది. వేణుగోపాల్ తన భార్య పద్మను చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో ఆమె విడాకులకు అప్లై చేసింది. కుటుంబ సభ్యులు రాజీ కోసం ప్రయత్నించగా పద్మ ఒప్పుకోలేదు. దీంతో వేణు భార్యను చంపి, మృతదేహాన్ని వెంకటాపురం చేపల చెరువులో పడేశాడు. ఈ ఘటన 5 నెలల క్రితం జరగ్గా ఇప్పుడు మిస్టరీ వీడింది.