ఇంటర్ సబ్జెక్టుల నుంచి సివిక్స్ (పౌరశాస్త్రం) ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ఇంటర్ బోర్డు స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని బోర్డు కార్యదర్శి తెలిపారు. ఇంటర్ లో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో పౌరశాస్త్రం ఎప్పటిలాగే ఉంటుందని తెలిపారు. సమాజ అవసరాలను బట్టి కొత్త కోర్సులు, సబ్జెక్టులను పరిచయం చేస్తామని చెప్పారు. జూన్ 30న పాలిసెట్ ను నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రకటించారు.