ఏపీలో ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండనుంది. మేకపాటి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వడంతో సంప్రదాయాన్ని పాటించాలని టీడీపీ భావిస్తోంది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ టీడీపీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జూన్ 23న జరగనుంది.