విజయవాడ సత్యనారాయణపురంలో ఓ వివాహిత కవిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సయమంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కవిత ఆత్మహత్యకు దంపతుల మధ్య జరిగిన వివాదమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. కవిత-సంగమేశ్వరరావు దంపతులు సత్యానారాయణపురంలో నివాసముంటున్నారు. కవిత గ్రామ సచివాలయ మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు.
అయితే భర్త సంగమేశ్వరరావు.. మరో మహిళతో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కూడా ఈ విషయమై దంపతులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆర్ధరాత్రి సమయంలో భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగా.. సదరు మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.