పుత్తూరు మున్సిపల్ సాధారణ సమావేశం మంగళవారం వైయస్సార్ భవనము నందు నిర్వహించారు. ఈ సాధారణ సమావేశానికి తొమ్మిది మంది వైకాపా కౌన్సిలర్లు, ఐదు మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. టిడిపి కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజలు ఓట్లు వేసి మమ్మల్ని ఎన్నుకుంటే మా వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని సమావేశంలో అధికారులను నిలదీశారు. వాదా వాదోపవాదాలు నడుమ రసాభాసగా మున్సిపల్ సమావేశం టిడిపి కౌన్సిలర్లు బాయ్ కట్ చేశారు