స్వీడన్ కు చెందిన ఆర్.లార్సన్ అనే 103 ఏళ్ల ఈ వృద్ధురాలు ఆదివారం మోటలాలో పారాచూట్ జంప్ చేసింది. ఆమె చేసిన ఈ విన్యాసానికి గిన్నిస్ రికార్డుల సంస్థ ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేసింది. నిపుణుడి సహాయంతో పారాచూట్ జంప్ చేసిన అత్యంత వృద్ధురాలైన పారాచూటిస్ట్ గా ఆమెకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు కల్పించింది.