టీడీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రెండు రోజులక్రితం మహానాడులో తనకు అవమానం జరిగిందని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.