మోదీ, అమిత్ షా జోడి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దేశ రాజకీయాలలో నేడు వారిజోడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కానీ వీరి మధ్య బందం ఈ నాటిది కాదని ఎన్నో ఏళ్ల కిందటే ఉండేదన్న ఓ ఫోటో తాజాగా తెరపైకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన చిత్రాల ప్రమోషన్లతోనే కాకుండా, ఇతర అంశాలపైనా స్పందిస్తూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. తాజాగా వర్మ సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. ఆ ఫొటోలో ఉన్నది ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదు. 1993 నాటి ఫొటో కాగా, జర్కిన్లు ధరించిన వారిద్దరూ ఓ విగ్రహం వద్ద నిల్చున్న దృశ్యం ఫొటోలో చూడొచ్చు. కాగా, ఈ ఫొటోకు వర్మ ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa