మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి మూడేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమోఘమని, పక్క రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి ఆలోచనలు చేస్తున్నారని రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. డిఆర్సి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం నుండి నాడు - నేడు పథకాలను అధ్యయనం చేసి పక్క రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.