తమిళనాడు చెంగల్పట్టుకు చెందిన 72 ఏళ్ల రతనం అనే వ్యక్తి అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. యువకుడిగా ఉన్నప్పటి నుంచే ఆయన తన శరీరాన్ని ఇలా మెయింటెన్ చేస్తున్నారు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన రతనం ఆసియా బాడీబిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు. 54వ ఆసియా బాడీ బిల్డింగ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.