ఈ వర్షాకాలంలో భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 103 శాతం వర్షపాతం రికార్డు కావొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. తాజాగా రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో ఐఎండీ తన అంచనాలను సవరించింది.