మహారాష్ట్రలోని షిర్గావ్ ప్రాంతంలో అశ్విన్ నికుంభ్(32) కుటుంబం నివసిస్తోంది. సోమవారం అతడి భార్య కోమల్ (22), అతని తల్లి మధ్య చపాతీలు చేయడం గురించి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అశ్విన్ తన భార్య కోమల్ చెవిపై రాయితో దాడి చేశాడు. దీంతో ఆమె కర్ణభేరి దెబ్బతింది. భార్య కోమల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త అశ్విన్ పై ఫిర్యాదు చేసింది. 325, 324, 504 సెక్షన్ల కింద అతనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.